ప్రణవ సంకల్ప యోగ సమితి ఆధ్వర్యంలో 7 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొవిడ్ సెంటర్లలో ఉచితంగా యోగ శిక్షణ తరగతులు నిర్వహింస్తూ.. వైరస్ బాధితులల్లో మానసిక ఉల్లాసాన్ని కల్పించారు. ఈ సేవలకు గుర్తింపుగా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పతంజలి శ్రీనివాసరావును సూర్యయోగ ఫౌండేషన్ నిర్వాహకులు సన్మానించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పతంజలి శ్రీనివాసరావు ముందుకు వచ్చి వైరస్ బాధితులల్లో మనోధైర్యం నింపారని సూర్య యోగ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బైసు మల్లికార్జున రావు కొనియాడారు.
ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించిన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. గత 200 రోజులుగా కొవిడ్ రోగులకు నిర్విరామంగా యోగ శిక్షణ ఇస్తున్నామని.. రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా రోగుల కోసం యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పతంజలి శ్రీనివాసరావు వెల్లడించారు.
ఇదీ చూడండి:
ఏలూరులో ప్రజల అస్వస్థతకు కారణాలు ఇంకా తెలియలేదు: మంత్రి ఆళ్ల నాని