ETV Bharat / state

'అమెరికాకు దగ్గరవుతున్నామనే చైనా దురాఘతం' - indo-china boarder issues

భారత్, చైనాలు 3,440 కి.మీ మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. అక్సాయిచిన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్న ఈ సరిహద్దులో ఒక్కోసారి ఒక్కో ప్రాంతం వివాదానికి కేంద్రబిందువు అవుతోంది. ప్రస్తుతం సరిహద్దులో ఈ రకంగా చైనా ఉద్రిక్తతలు సృష్టించడానికి కారణం... అంతర్జాతీయ పరిణామాలు, మన విదేశాంగ విధానాల్లో వచ్చిన మార్పులేనని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

experts comments on indo-china-issues
భారత్-చైనా వివాదం పై నిపుణుల అభిప్రాయం
author img

By

Published : Jun 17, 2020, 8:01 PM IST

భారత్-చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు మనం అనుసరిస్తున్న విదేశాంగ విధానాల్లో వచ్చిన మార్పులతో పాటు కరోనా కూడా ఓ కారణం అంటున్నారు విశ్లేషకులు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రస్తుతం లడఖ్​లో భారత్ నిర్మిస్తోన్న రహదారి కారణంగానే... చైనా మనతో కాలుదువ్వడానికి కారణమైందని నిపుణులు అంటున్నారు. వివాదాస్పద స్థలంలో రోడ్లు ఎలా నిర్మిస్తారని చైనా ప్రశ్నిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు చైనా దీనిపై ఈ స్థాయిలో స్పందించటానికి కారణాలు మాత్రం అనేకం ఉన్నాయని నిపుణలు వివరిస్తున్నారు.

మన జాతీయ ప్రయోజనాల కోసం భారత్ అమెరికాకు అనుకూలంగా ఉంటోంది. ఇది చైనాకు ఆగ్రహం తెప్పిస్తోంది. మనం గతంలో అలీన విధానం పాటించేవాళ్లం. ఏ అగ్రరాజ్యానికి అనుకూలంగా ఉండబోమని చెప్పాం. కానీ ఇపుడు అమెరికాకు దగ్గరవుతుండటం తమ జాతీయ భద్రతకు ప్రమాదమని చైనా భావిస్తోందని విశ్లేషిస్తున్నారు. జీ7 దేశాల్లోకి భారత్​కు ఆహ్వానం పంపిన అమెరికా... చైనాను మాత్రం విస్మరించింది. ఇది కూడా చైనా అగ్రహానికి మరో కారణం. ఇటీవల కాలంలో యు.ఎస్, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిసి క్వాడ్ అనే సమూహంగా ఏర్పడ్డాయి. ఈ క్వాడ్ తరపున చైనాకు వ్యతిరేక ప్రకటనలు వెలువడుతుండటం కూడా డ్రాగన్​ దేశానికి కోపం తెప్పించిందని నిపుణులు భావిస్తున్నారు.

భారత్-చైనా వివాదం పై నిపుణుల అభిప్రాయం

ఇటీవల ప్రపంచాన్ని భయకంపితం చేస్తున్న కొవిడ్-19 వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం చైనా అనే విమర్శలొస్తున్నాయి. దీంతో చైనాను అందరూ దుయ్యబడుతున్నారు. ఆ దేశం పూర్తి అభద్రతా వాతావరణంలో ఉంది. దీంతో అక్కడి ప్రజల దృష్టి మరల్చటం కోసం ఇండియాపై కాలు దువ్వుతోందని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు కృపాదానం అభిప్రాయపడుతున్నారు. చైనా పెట్టుబడులను అహ్వానించే విషయంలో మోదీ విధించిన ఆంక్షలు కూడా మరో కారణంగా విశ్లేషిస్తున్నారు. ఆర్థికంగా ఇది చైనాకు దెబ్బ. ఇపుడు నేపాల్ తమ మ్యాప్ ను మార్చి ఇండియాపై కాలు దువ్వటం వెనుక కూడా చైనా హస్తం ఉందని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి: చైనాతో కయ్యం ఒక్కోసారి ఒక్కో చోట.. ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.