గుంటూరు జిల్లా కొండవీడులో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. కొంతకాలంగా ఇక్కడ అక్రమంగా సారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ సిబ్బంది నిఘా ఉంచారు. దాదాపు 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి.. ఐదు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి..