ETV Bharat / state

లైంగిక వేధింపుల వ్యవహారంలో ఎక్సైజ్ ఉన్నతాధికారి సస్పెండ్ - మహిళా ఎస్​ఐతో ఎక్సైజ్ ఉన్నతాధికారి అసభ్య ప్రవర్తన

గుంటూరు జిల్లా ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ బాలకృష్ణన్ సస్పెండ్ అయ్యారు. మహిళా ఎక్సైజ్ ఎస్​ఐని లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యవహారంలో ఆయనను సస్పెండ్ చేస్తూ.. డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

లైంగిక వేధింపుల వ్యవహారంలో ఎక్సైజ్ ఉన్నతాధికారి సస్పెండ్

author img

By

Published : Oct 12, 2020, 8:54 PM IST

లైంగిక వేధింపుల వ్యవహారంలో గుంటూరు జిల్లా ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ బాలకృష్ణన్ సస్పెండ్ అయ్యారు. తనను బాలకృష్ణన్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ మహిళా ఎక్సైజ్ ఎస్ఐ ఉన్నతాధికారులకు నెల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో బాలకృష్ణన్​ను కొద్దిరోజులు విధులకు దూరంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

అనంతరం మహిళా ఎక్సైజ్ ఎస్​ఐ ఫిర్యాదుపై అధికారులు విచారణ కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు... బాలకృష్ణన్​ను సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ బాలకృష్ణన్ జిల్లా కేంద్రం వదిలి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

అధికారి వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగిన రిసోర్స్ పర్సన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.