ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉద్యోగి, సంస్థల రెండు వాటాలను మార్చి, ఏప్రిల్, మే నెలలకు ప్రభుత్వమే చెల్లిస్తుందని... ఈ రాయితీని జూన్, జులై, ఆగస్టు వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్లు ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ కుందన్ వెల్లడించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సంస్థలు వినియోగించుకోవాలన్న ప్రాంతీయ కమిషనర్... ఇప్పటివరకు 51.9 శాతం సంస్థలే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నాయని చెప్పారు. ఈ రాయితీని వినియోగించుకోకపోతే సంస్థతోపాటు ఉద్యోగులకూ నష్టం వాటిల్లుతుందని...ఇప్పటికైనా ఈసీఆర్లు సమర్పించాలని కుందన్ అలోక్ కోరారు.
ఇదీ చదవండీ... ఏ ఘనకార్యాలు సాధించారని సంబరాలు?: యనమల