ETV Bharat / state

ఓ వైపు విధుల నిర్వహణ..మరోవైపు సేవలు

author img

By

Published : May 21, 2021, 4:25 PM IST

కరోనా వేళ జర్నలిస్టుల సేవలు మరువలేనివి. కోవిడ్ వస్తుందని తెలిసినా.. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తూ..సలహాలు, సూచనలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో..ప్రభుత్వాసుపత్రిలోని బాధితులకు పాలు, గుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు.

tenali
తెనాలిలో ఎలక్ట్రానిక్ మీడియా ఉదారత

విధి నిర్వహణలో కరోనా కాటుకు గురై ఎంతోమంది జర్నలిస్టులు ప్రాణాలు వదిలారు. అయినా కూడా ప్రాణాలకు భయపడకుండా ప్రజల సమస్యలను తెెలుసుకుంటున్నారు. కొవిడ్ బాధితులకు తమ వంతు సహాయంగా గుంటూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా తెనాలిలోని జిల్లా కొవిడ్ ప్రభుత్వాసుపత్రిలోని బాధితులకు పాలు, గుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, ఏపీయుడబ్ల్యూజే, రాష్ట్ర కార్యదర్శి చందు జనార్ధన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి తమ వృత్తిని నిర్వర్తిస్తున్న ప్రతి విలేఖరికి అభినందనలు అని ఎమ్మెల్యే కొనియాడారు. మరోవైపు మానవత్వాన్ని చాటుతూ.. కోవిడ్ బాధితులకు తమ వంతు సాయం చేయడం గర్వనీయమన్నారు.

tenali
తెనాలిలో ఎలక్ట్రానిక్ మీడియా ఉదారత
ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి..కోవిడ్ రెండవ దశలో వైరస్ వ్యాప్తి చెందుతూ మరణ మృదంగం మోగిస్తున్నా.. జర్నలిస్టులు మాత్రం వెనకడుగు వేయకుండా.. పని చేస్తూనే ఉన్నారని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి చందు జనార్ధన్ పేర్కొన్నారు. కొవిడ్ వైరస్ సోకి మొదటి దశలో 50 మంది.. రెండవ దశలో 70 మంది విలేకరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రస్తుతం మరికొంతమంది వైరస్​తో చికిత్స పొందుతున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్​తో మృతి చెందిన విలేకరులకు రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారని.. అవి త్వరితగతిన వారి కుటుంబాలకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే క్రమంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారికి ఆర్థిక సాయంగా కనీసం రూ.30 వేలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చూడండి.
రోగుల సహాయకుల ఆకలి తీరుస్తున్న రెడ్ క్రాస్ సంస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.