ETV Bharat / state

Electricity Charges Hike: మరోసారి బాదుడే బాదుడు.. విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు పిడుగు

Electricity Charges Hike in Andhra Pradesh: విద్యుత్ వినియోగదారులపై మరోసారి ఇంధన సర్దుబాటు పిడుగుపడింది. యూనిట్‌కు 40 పైసలు చొప్పున అదనంగా డిస్కంలు వసూళ్లు చేయనున్నాయి. మే నెల బిల్లుతో కలిపే ఈ మొత్తం వినియోగదారుల నుంచి డిస్కంలు రాబట్టుకోనున్నాయి. మరో 80 పైసలు ఈ ఏడాది చివరిలో ఈఆర్​సీ అనుమతితో తీసుకోనున్నాయి.

Electricity Charges Hike
విద్యుత్ ఛార్జీల పెంపు
author img

By

Published : Jun 3, 2023, 7:56 AM IST

Electricity Charges Hike in Andhra Pradesh: ఇప్పటికే పలుమార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు మరో వడ్డనకు తెరలేపింది. ఇందన సర్దుబాటు పేరిట యూనిట్‌కు 40పైసల వంతున మే నెల బిల్లుతో కలిపి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ బిల్లులు చూసి బెంబేలెత్తిపోతున్న సామాన్య ప్రజలు.. సర్దుబాటు పోటుతో మరింత షాక్‌ తిననున్నారు.

ఏప్రిల్‌ నెలలో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనేందుకు ఖర్చు చేసిన ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కంలు వసూలు చేస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నెలా ఈ ఛార్జీలను వసూలు చేసుకునే వెసులుబాటును రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి.. డిస్కంలకు కల్పించింది. ఈఆర్​సీ అనుమతి లేకుండానే గరిష్ఠంగా యూనిట్‌కు 40 పైసలు వసూలు చేసే అధికారం డిస్కంలకు ఉంది.

Power Subsidy In AP: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై బాదుడే బాదుడు

ఇలా వసూలు చేసిన మొత్తాన్ని సంవత్సరం చివరలో సర్దుబాటు చేయనున్నాయి. ఇప్పటికే ప్రతి నెలా వచ్చే బిల్లులో 2 వేల 910 కోట్లు, 3 వేల 83 కోట్లకు సంబంధించిన ట్రూఅప్‌ మొత్తాన్ని డిస్కంలు కలిపి వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు 3వ ట్రూఅప్‌ ప్రజలకు మరింత భారం కానుంది. ఎంత భారం పడుతుందన్న వివరాలను మాత్రం అధికారులు చెప్పడం లేదు.

ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటి వరకు గడిచించి కేవలం 2 నెలలే. ఈ రెండునెలల విద్యుత్ కొనుగోళ్లతోనే డిస్కంలు తట్టుకోలేని నష్టాలు వచ్చాయని లెక్కలు తేల్చాయి. వేసవిలో డిమాండ్‌ మేరకు సరఫరా చేయడానికి బహిరంగ మార్కెట్‌ నుంచి కొనడానికి డిస్కంలు కోట్లు ఖర్చు చేశాయి. వినియోగదారుల నుంచి వసూలు చేసే బిల్లు కన్నా.. అధిక ధరకు మార్కెట్‌లో కొన్న విద్యుత్‌ వల్ల ఇంకా యూనిట్‌కు 1.20 రూపాయల వంతున నష్టం వస్తోందని.. డిస్కంలు లెక్క తేల్చాయి.

Electricity Charges :విద్యుత్​ వినియోగదారులకు షాక్​.. మరోసారి సర్దుబాటు ఛార్జీల భారం

ఈ నష్టాన్ని భర్తీ చేసుకోడానికి ట్రూఅప్‌ కింద యూనిట్‌కు 40 పైసల వంతున మే నెల బిల్లులో వసూలు చేసి.. మిగిలిన నష్టాలకు సంబంధించి ఏడాది చివరలో ఈఆర్​సీకి లెక్కలు చూపి వసూలు చేసుకోడానికి వీలుగా అనుమతి తీసుకోవాల్సి ఉంది. అంటే.. యూనిట్‌కు 40 పైసలతో ఏప్రిల్‌ నెలకు సంబంధించిన ట్రూఅప్‌ భారం వదిలిపోయిందని వినియోగదారులు అనుకోవడానికి వీల్లేదు.

ఎందుకంటే డిస్కంలు చెప్తున్న వివరాల ప్రకారం ఇంకా ఒక్కో యూనిట్‌కు 80 పైసల చొప్పున ట్రూఅప్‌ ప్రతిపాదనలను సంవత్సరం చివర్లో డిస్కంలు దాఖలు చేస్తాయి. వాటిని పరిశీలించి.. ఎంత మొత్తాన్ని వసూలుకు అనుమతించాలనే దానిపై ఏపీ ఈఆర్​సీ నిర్ణయిస్తుంది. మే నెల బిల్లులో డిస్కంలు వసూలు చేసిన మొత్తానికి మరో రెండు రెట్ల భారాన్ని ఏడాది చివరలో భరించడానికి వినియోగదారులు ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధంగా ఉండాలి.

Power Cut in Govt Hospital: ప్రభుత్వాసుపత్రిలో కరెంట్ కోతలు.. నరకం చూస్తున్న రోగులు..

ఇప్పటికే మే నెలలో కూడా భారీగా వ్యయంతో డిస్కంలు విద్యుత్​ను కొనుగోలు చేశాయి. నిబంధన ప్రకారం వచ్చే నెల కూడా యూనిట్‌కు మరో 40 పైసలు వసూలు చేసేందుకు డిస్కంలు సిద్ధంగా ఉన్నాయి. ఏ నెలకు ఆ నెల విద్యుత్‌ కొనుగోలు చేస్తే అందుకు అనుగుణంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ భారం వినియోగదారులకు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

"అప్పటికి అప్పుడు ఎక్కువ ధరలలో కొనుగోలు చేసి.. ఆ భారాన్ని సామాన్య ప్రజలపై వేయడం సమంజసం కాదు. దీనిపై తప్పనిసరిగా ప్రభుత్వం పునరాలోచించాలి". - మాగులూరు నాగేశ్వరరావు, రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు

మరోసారి బాదుడే బాదుడు.. విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు పిడుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.