పురపాలక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెనాలిలో 25 వేలకు పైగా ఇంటి పట్టాలిచ్చామని.. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెలుగుదేశం అభ్యర్థుల తరపున మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రచారం నిర్వహించారు. వైకాపా ఓటమి భయంతోనే.. తెదేపా అభ్యర్థులను బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
మే చివరికల్లా పోలవరం కాఫర్ డ్యాం పనులు పూర్తి చేయాలి: సీఎం జగన్