ETV Bharat / state

తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి... విచారణకు రావాలి..! - ఉండవల్లి శ్రీదేవి క్రిష్టియనిటిపై విమర్శలు న్యూస్

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సామాజికవర్గం గురించి వివాదం చెలరేగుతోంది.​ ఆమె ఎస్సీ కాదని... రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లింది. శ్రీదేవి విచారణకు రావాలని... గుంటూరు జిల్లా సంయుక్త పాలనాధికారి శ్రీదేవికి లేఖ రాశారు.

ఎమ్మెల్యే శ్రీదేవి ఈసీ ఆదేశాలు
author img

By

Published : Nov 19, 2019, 6:14 PM IST

తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి

అసలేం జరిగిందంటే..?
ఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్​లో వైద్యవృత్తిలో ఉండేవారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైకాపాలో చేరారు. సాధారణ ఎన్నికల్లో తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి... శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఓ యూట్యూబ్ ఛానల్​కు ఇస్తున్న ఇంటర్వ్యూలో... తన కుటుంబ సభ్యుల గురించి చెబుతూ... తానూ క్రిస్టియన్ అని తెలిపింది. అక్కడే వివాదం మెుదలైంది. చిన్నప్పుడు తాడికొండ గ్రామంలోనే పెరిగానని... అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని చెబుతూ... కులాన్ని కూడా ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.

26వ తేదీ.. విచారణ...
ఈ ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి... క్రిష్టియన్ అయిన శ్రీదేవి ఎలా పోటీ చేస్తారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు సంతోష్... రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అక్టోబర్ నెలలో రాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖపై స్పందించింది. ఈ అంశంపై విచారణ జరపాలని ఎన్నికల కమిషన్​కు, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

రిజర్వేషన్ అంశంపై విచారణ జరపాలని గుంటూరు జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్​కు ఆదేశాలు అందాయి. ఆ మేరకు ఈనెల 26న మధ్యాహ్నం 3గంటలకు జరిగే విచారణకు హాజరు కావాలని శ్రీదేవికి లేఖ రాశారు. ఎస్సీ రిజర్వేషన్​కు సంబంధించిన ధ్రువపత్రాలు తీసుకురావాలని సూచించారు. తల్లిదండ్రులు ఉంటే.. వారిని కూడా తీసుకురావొచ్చని వివరించారు.

ఇబ్బంది పెట్టేందుకే అలా...
తాను ఎస్సీనే అంటూ శ్రీదేవి ఓసారి మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ తనను ఇబ్బంది పెట్టేందుకు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. అయితే ఇప్పుడు జరిగే విచారణలో ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే క్రిష్టియన్ అని చెప్పిన మాటలపైనా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది

ఇదీ చదవండి:తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి రిజర్వేషన్​పై విచారణ

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.