ETV Bharat / state

బ్రాడిపేటలో క్రికెట్ బెట్టింగ్​లు నిర్వహిస్తున్న 8 మంది అరెస్ట్ - బ్రాడిపేటలో పోలీసుల తనిఖీలు వార్తలు

క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడుతున్న 8 మందిని గుంటూరు జిల్లా అరండల్​పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.15 వేల నగదు, 7 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

eight members arrested for playing cricket betting in Bradypeta
బ్రాడిపేటలో క్రికెట్ బెట్టింగ్​లు ఆడుతున్న 8 మంది అరెస్ట్
author img

By

Published : Oct 2, 2020, 6:46 AM IST

గుంటూరు జిల్లా బ్రాడిపేట హోటల్, గోల్డెన్ పార్క్ లాడ్జిపైన పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఆన్​లైన్​, వివిధ యాప్​ల బెట్టింగ్​లు నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రావెళ్ళ రామకృష్ణ, కనథం నరేంద్ర బాబు, షేక్ ఖాసీం, షేక్ సలీం, నల్లమోతు జితేంద్ర, దోర్సిల మధు, షేక్ సుభాని, షేక్ మౌలాలీలను పట్టుకున్నారు. నిందితుల నుంచి 15 వేల నగదు, 7 సెల్​ఫోన్​లను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరండల్​పేట పోలీస్ స్టేషన్​కు తరలించి కేసు నమోదు చేసినట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ రమణ కుమార్ తెలిపారు. నగరంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి. జడ్జి రామకృష్ణను తిరుపతిలో అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.