పిల్లలకు మనమిచ్చే గొప్ప ఆస్తి చదువేనని 'ఈనాడు' ఎడిటర్ నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు జిల్లా పరిషత్ పాఠశాల 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన 'స్నేహానికి షష్టిపూర్తి' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఊరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన గ్రామమంటే తనకు ఎంతో ఇష్టమని.. ఈ ఊరిలో పుట్టడం తన అదృష్టమని తెలిపారు. తమ ఊరి నుంచి నోబెల్ పురస్కార గ్రహీత, ఒలింపిక్ ఆటగాళ్లు రావాలనేది తన ఆకాంక్ష అని తెలియజేశారు.
తపనతోనే రాణించగలం...
యువతకు ఏదైనా సాధించాలనే తపన ఉండాలన్నారు నాగేశ్వరరావు. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని.. అలాంటి వారికి సహకారం అందించేందుకు ఊరివాళ్లు సంసిద్ధంగా ఉన్నారన్నారు. మనమంతా పూర్వీకుల బాటలో నడుస్తున్నామని.. వాటిని భవిష్యత్ తరాలకు అందివ్వాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని సూచించారు.
ఇవీ చదవండి.. విశ్వాసానికి తుది వీడ్కోలు..!