గుంటూరు క్యాంపు కార్యాలయం నుంచి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ చేశారు. నియోజకవర్గంలో కరోనా పరిస్థితుల వివరాలు తెలుసుకున్నారు. హోమ్ ఐసొలేషన్ లో ఉన్న వారందరికీ కిట్లు అందాయా అని ప్రశ్నించారు. కంటైన్మెంట్ జోన్ లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలన్నారు. రాబోయే రెండు వారాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కర్ఫ్యూ అమలు కఠినంగా చేయాలని చెప్పారు.
కర్ఫ్యూపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. గ్రామాల్లో శానిటైజేషన్ ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవల్లో ఉండే జర్నలిస్టులు, వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగులకు పాస్ లు జారీ చేయాలన్నారు. నియోజకవర్గంలో వైద్యం అందక ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని మంత్రి సురేశ్ అధికారులను ఆదేశించారు. ఈ కాన్ఫెరెన్స్ లో మార్కాపురం ఆర్డీఓ శేషిరెడ్డి, డిఎస్ పి కిషోర్ కుమార్, సి ఐ దేవప్రభాకర్, ఐదు మండలాల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: