సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేయాలని డీవీసీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది డిమాండ్ చేశారు. అధికారులు, ప్రభుత్వ తీరుని నిరసిస్తూ.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని వైద్యశాల వద్ద ఆందోళనకు దిగారు. ఆయన అనారోగ్యం పాలైనా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. జైలు అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కరోనా పంజా: తాత్కాలిక శ్మశానాలు ఏర్పాటు చేస్తారా?
దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభించి హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న వేళ.. రాజకీయ కక్షలతో అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఆరోగ్యం సరిగా లేని వ్యక్తికి కనీస చికిత్స అందించకపోవటాన్ని వైద్యులు తప్పుపట్టారు. నరేంద్ర ఆరోగ్యస్థితిపై తామంతా ఆందోళనగా ఉన్నామని.. వెంటనే అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: