కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వట్లేదని దుగ్గిరాల తెదేపా ఎంపీపీ అభ్యర్థి మళ్లీశ్వరి ఆరోపించారు. 3 రోజుల నుంచి తహశీల్దార్ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 24న ఎంపీపీ ఎన్నికను చేపట్టనున్నారు. ఈ క్రమంలో కుల ధ్రవీకరణపత్రం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇందతా ఎంపీపీ పదవి కోసం వైకాపా చేస్తున్న కుట్రగా అనుమానం వ్యక్తం చేశారు. దుగ్గిరాల మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గానూ.. తెదేపా 9, వైకాపా 8, జనసేన 1 గెలిచాయి. ఫలితంగా 9 స్థానాల్లో గెలిచిన తెదేపాకు ఎంపీపీ పదవి దక్కే అవకాశం ఉంది.
ఇదీ చదవండి
GANDHIJI: గాంధీజి కొల్లాయి (ధోవతి) కట్టి నేటికి వందేళ్లు