గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవున్నాయి. ప్రజలు గమనించి బయటకు రాకుండా అధికారులకు సహకరించాలని ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. ఐదురోజులుగా పట్టణంలో పూర్తి లాక్ డౌన్ నిర్వహించడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, రేషన్, పింఛన్లు పంపిణీ ని దృష్టిలో పెట్టుకుని సోమ, మంగళవారాల్లో లోక్ డౌన్ ను సడలించి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించామన్నారు.
ఎవరికైనా అవసరమైన సరకులు, కూరగాయలు, పాలు అధికారులు ఇచ్చిన ఫోన్ నెంబర్లకు సంప్రదించి కావలసినవి తెప్పించుకోవచ్చని అన్నారు.నిత్యవసరాలలో ఇబ్బందులు ఎదురైతే అధికారులు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు పోన్ చేసి పిర్యాదు చేయొచ్చని తెలిపారు.
ఇదీ చూడండి రాష్ట్రంలో మద్యం విక్రయాల తొలిరోజు ఆదాయమెంతంటే..?