వీధి కుక్కులను చంపిన ఘటనలో ఆర్డీవోకు వినతిపత్రం గుంటూరు జిల్లా తెనాలి మండలం హాఫ్ పేట లో 60 వీధికుక్కలను చంపిన ఘటనలో జంతు సంరక్షణ సొసైటీ సభ్యులు ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులను కలిశారు. శునకాలను చంపకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వదిలేయాల్సిన అధికారులు.. విచక్షణారహితంగా కుక్కలను చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతు హింస నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి-60 వీధి కుక్కలను చంపేశారు