ఈఎస్ఐ వ్యవహారంలో అరెస్టై.. ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు వైద్యులు మరోసారి శస్త్రచికిత్స నిర్వహించారు. చికిత్సలో భాగంగా గత నాలుగు రోజుల నుంచి మందులు ఇస్తున్నా.. ఆయనకు ఉపశమనం కలగలేదని వైద్యులు తెలిపారు. మలద్వారం చుట్టుపక్కల రక్తస్రావం జరుగుతుందని వివరించారు.
ఫలితంగా వైద్య పరీక్షలు నిర్వహించి.. అన్ని సమస్యలకు పరిష్కారంగా మరోసారి శస్త్రచికిత్స నిర్వహించామని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. అచ్చెన్నాయుడుకు మరో ఐదు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి..