National Deworming Day In Mangalagiri : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నేషనల్ డీ వార్మింగ్ డే అనేది ఒక పాన్ ఇండియా లెవెల్ పబ్లిక్ హెల్త్ పోగ్రామ్ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చెప్పారు. ప్రజల ఆరోగ్య సమస్యలన్నీ డిజిటల్ రూపంలో భద్ర పరిచేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలం చినకాకాని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు డీవార్మింగ్ మాత్రలను అందజేశారు. రాష్ట్రంలో కోటి ఏడు లక్షల మంది విద్యార్థులకు నులిపురుగు నివారణ మందులను సరఫరా చేస్తున్నామని ఆమె చెప్పారు.
ఏప్రిల్ 6 నుంచి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ : ఈ నెల 18 న మరోసారి నులిపురుగు నివారణ మందుల సరఫరా కార్యక్రమాన్ని చేపడతున్నామని విడుదల రజని అన్నారు. ఏప్రిల్ 6 న ప్రారంభించబోయే డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లో ప్రజల ఆరోగ్య సమస్యలు, వైద్య సేవలను డిజిటల్ రూపంలో భద్రం చేస్తామని, దీని వల్ల అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా అతని సమస్య వైద్యులందరికీ అందుబాటులో ఉండటంతో చికిత్స అందించడం సులభంగా ఉంటుందని ఆమె అన్నారు. మొత్తం కోటీ ఏడు లక్షల మంది విద్యార్థులకు మాత్రలు సరఫరా చేస్తున్నట్లు విడదల రజనీ వెల్లడించారు.
" నేషనల్ డీ వార్మింగ్ డే అనేది ఒక పాన్ ఇండియా లెవెల్ పబ్లిక్ హెల్త్ పోగ్రామ్. దీనిలో భాగంగా మనము మన రాష్ట్రంలో చేపట్టాము. ఆల్బెండజోల్ 400 ఎమ్జీ అనే ఈ టాబ్లెట్‌ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాలలోపు వయసు ఉన్నవాళ్ల అందరికి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ని ఏప్రిల్ 6న లాంచ్ చేయబోతున్నారు. మరీ ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో ఉన్నటువంటి సచివాలయాల పరిధిలో డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ డాక్టర్స్ వచ్చి అక్కడ వైద్యసేవలు అందిస్తారు. పేషంట్ హెల్త్ వివరాలు ఎలక్ట్రానిక్ రికార్ట్ రూపంలో స్టోర్ చేయడం వల్ల ఈ పేషంట్ మళ్లీ ట్రిట్మెంట్కు వచ్చినపుడు మరింతా క్షుణంగా ఆరోగ్య పరీక్షలు చేయడానికి ఉపయోగపడతాయి. " - విడదల రజనీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ఇవీ చదవండి