శాసనమండలిని వైఎస్సార్ పునరుద్ధరించినప్పుడు జగన్ ఎందుకు నోరు మెదపలేదని... తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. మంత్రులు సుభాష్ చంద్రబోస్, మోపిదేవితో రాజీనామా చేయించి ఆ తర్వాత మండలిపై చర్చించాలని ప్రభుత్వానికి సూచించారు. పదవులు పోతాయని తమకు ఎలాంటి భయం లేదని వ్యాఖ్యానించారు. బెదిరింపులే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మండలిని రద్దు చెయ్యరని పేర్కొన్నారు. రాజధాని పేరుతో సీఎం జగన్ ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు.
ఇదీచదవండి