సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రులంతా సానుకూలత వ్యక్తం చేస్తే ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. వెంటనే శాసనసభలో నిర్ణయాన్ని తెలిపి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. సభలో రద్దుపై తీర్మానం చేసి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిసింది. మరోవైపు శాసనసభ, మండలి నిరవధిక వాయిదా పడిన అనంతరం ఆర్డినెన్స్ తీసుకువచ్చే అంశంపైనా మంత్రివర్గంలో సమాలోచనలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి :