Diwali Celebrations Doctor Precautions: దీపావళి పండుగకు టపాసులు కాల్చేందుకు చిన్నారులు ఉర్రూతలూగుతారు. పెద్ద శబ్దాలతో రంగు రంగులతో మిరుమిట్లుగొలిపే కాంతులు వచ్చే టపాసులు కొనుగోలు చేస్తుంటారు. కుటుంబంతో కలిసి క్రాకర్స్‌ను కాలుస్తారు. అయితే దీపావళి సంతోషంగా జరుపుకోవటంతో పాటు.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్యులు సూచిస్తున్నారు. చిన్న తప్పు చేస్తే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
Diwali Safety Precautions: దీపావళి అంటే చాలు.. చిన్నారులు ఎగిరి గంతేస్తారు. ఎప్పుడెప్పుడు టపాసులు కాలుస్తామా అని నిరీక్షిస్తారు. ఎక్కువ కాంతిని ఇచ్చే టపాసులు కొనుగోలు చేసేందుకు ఆశక్తి చూపుతుంటారు. నూతన పరిజ్ఞానంతో వచ్చే క్రాకర్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. దీపావళి పండుగ వైభవంగా జరుపుకొనేందుకు చిన్నారులు ఉత్సాహం చూపుతుంటారు. అయితే పండుగ జరుపుకొనే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ అధికారులు సూచిస్తున్నారు.
అక్షర్ధామ్ ఆలయంలో దీపావళి వేడుకలు- 'గ్లో గార్డెన్ థీమ్'తో 10వేల దీపాలంకరణ!
Precautions for Diwali Celebrations: క్రాకర్స్ విక్రయించే దుకాణదారులు సైతం పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. దుకాణాల మధ్య కనీసం మూడు అడుగుల దూరం ఉండాలని సూచిస్తున్నారు. అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు కావాల్సిన నీటిని అందుబాటులో ఉంచుకోవాలని, ప్రమాదాలను నివారించే అగ్నిమాపక పనిముట్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టపాసులు రవాణా చేసేటప్పుడు, దుకాణాల్లో సర్దుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Diwali Celebrations in AP: గతంలో విజయవాడలో నాసిరకమైన టపాసులు క్రమంలో నిర్లక్ష్యం వహించినందుకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రాణనష్టం సంభవించింది. ప్రమాదాలు మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు క్రాకర్స్‌ను కాల్చేటప్పుడు చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్యులు సూచిస్తున్నారు. టపాసులు పేలే సమయంలో వెలువడే వాయువులు పీలిస్తే ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు.
లండన్‌లో కన్నులపండువగా దీపావళి సంబరాలు - ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు వంటకాలు
Diwali Celebrations 2023: కంటికి దగ్గరలో క్రాకర్స్‌ను ఉంచి కాల్చవద్దని సూచిస్తున్నారు. చిన్నారులు కాటన్ దుస్తులు ధరించాలి. ఎక్కువ కాంతిని ఇచ్చే టపాసులు కాల్చేటప్పుడు కంటికి కళ్లజోడు ధరించాలని సూచిస్తున్నారు. కళ్లలోకి టపాసుల పొగ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హితవు పలికారు. క్రాకర్స్ రవ్వలు పడితే కంటిలో సున్నితంగా ఉండే రెటీనాకు దెబ్బతినే అవకాశముంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Diwali Doctor Precautions: కొన్ని టపాసులు వెలగట్లేదని కొందరు వాటి దగ్గరకు వెళ్లే క్రమంలో అవి పేలుతుంటాయని.. వాటి వద్దకు వెళ్లొద్దని చెబుతున్నారు. అపార్ట్మెంట్లో ఒకేచోట ఉండి క్రాకర్స్‌ను కాలుస్తుంటారు. ఈ సందర్భంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సంతోషాలతో జరుపుకొనే పండుగను విషాదాంతంగా మార్చుకోవద్దని వైద్యులు హితవు చెబుతున్నారు. కళ్లు నీరుకారుతున్నా.. ఏదైనా సమస్య వచ్చినా వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు.
షిరిడీ సాయి ఆలయంలో దీపావళి ఉత్సవాలు - విద్యుత్‌దీపాల కాంతులతో మెరిసిపోతున్న సాయిమందిరం