గుంటూరు జిల్లా పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా పేషెంట్లకు అందుతున్న సేవలను వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ పేషెంట్లు ఎంత మంది ఉన్నారు, వారికి అందుతున్న సదుపాయాలు.. వంటి వసతులపై ఆయన ఆరా తీశారు.
వైద్యశాలలో పేషెంట్లకు అసౌకర్యం కలగకుండా సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు చేయాలని సూచించారు. కరోనా బారిన పడిన వారు భయపడాల్సిన పని లేదన్నారు. పాజిటివ్ నిర్ధరణ అయినవారిలో 90 శాతం మంది హోమ్ ఐసోలేషన్లోనే కోలుకుంటున్నారని చెప్పారు. తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, వైద్య అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
జగన్ తాత్కాలిక సీఎం మాత్రమే.. తరువాత కొత్త సీఎం వారే: చింతా మోహన్