గుంటూరు జిల్లాలో కొత్తగా 12 కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తూ... జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నకరికల్లు మండలంలోని నర్సింగపాడు, తెనాలి పట్టణంలోని కవిరాజుపార్క్, పెదకాకానిలోని ఎన్టీఆర్‌కాలనీ, తాడేపల్లి మండలంలోని పెనుమాక, చుండూరు మండలంలోని మామిళ్లపల్లి, పొన్నూరు మండలంలోని బ్రాహ్మణకోడూరు, తాడికొండ మండలంలోని బడేపురం, ముక్కామల, పాతసినిమాహాల్ సెంటర్, తెనాలి రూరల్ మండలం పరిధిలోని అంగలకుదురు, రేపల్లె మండలంలోని బేతపూడి, రెంటచింతల మండలంలోని గోలీ ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు.
ఇదీ చదవంది: నన్నపనేనికి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పరామర్శ