లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన రోజు వారీ కూలీలు, పేదలకు గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా నాయకులు, వర్తక వాణిజ్య సంఘం నాయకులు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. పట్టణంలోని 100 మంది గండాలయపేటకు చెందిన సుమారు 150 మంది కూలీలకు ఆహారాన్ని అందించారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు మే 3 వరకు ఆహారం పంపిణీ చేస్తామని నేతలు తెలిపారు. ఆకలితో అలమటించే వారు ఎంత మంది ఉన్నా... వారికి ఆహారం అందిస్తామని నాయకులు చెప్పారు.
ఇదీ చూడండి: