గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కరోనా బాధితులకు ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు రోటరీ క్లబ్ కాన్సంట్రేటర్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని ఎంపీ అన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: