గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురంలో ఉన్న వసంత స్పిన్నింగ్ మిల్స్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 1200 కుటుంబాలకు గురువారం బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. 1200 కుటుంబాలకు మైలవరం ఎమ్మెల్యే, వసంత స్పిన్నింగ్ మిల్స్ ఎండీ వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పాల్గొన్నారు.
ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ ప్రాంతంలో తమ ఫ్యాక్టరీ ఉందని, అందరి సహకారంతో సజావుగా వ్యాపారాలు కొనసాగించగలుగుతున్నామని ఎండీ కృష్ణప్రసాద్ తెలిపారు. లాక్ డౌన్ తో ప్రజలు పస్తులుండాల్సిన దుర్భర పరిస్థితులు కొన్ని చోట్ల ఎదురవుతున్నాయని చిలకలూరిపేట ఎమ్మెల్యే రజిని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సమయంలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుందన్నారు. తిమ్మాపురంలో పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.