రాష్ట్రవ్యాప్తంగా దీపావళి పండుగ శోభ కనిపిస్తోంది. ఈ పండుగకు ప్రధానమైన ప్రమిదల విక్రయాలు భారీగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది కొనుగోలుదారుల అభిరుచి మేరకు విభిన్నరీతిలో ప్రమిదలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
గుంటూరులో మట్టి ప్రమిదలు భారీగా అమ్మకానికి పెట్టారు. భిన్న రూపాలు, వివిధ అలంకరణలతో కనువిందు చేస్తున్న వీటిని కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వీటిని తెప్పించి విక్రయిస్తున్నారు. గుంటూరు నగరంలోని లాడ్జ్ సెంటర్, మార్కెట్ సెంటర్, అమరావతి రోడ్డు తదితర ప్రాంతాలలో విక్రయిస్తున్న మట్టి ప్రమిదలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. స్వస్తిక్, శంఖం, చక్రం, కొబ్బరికాయ, తులసి కోట ఆకారాల్లో మట్టి ప్రమిదలు లభిస్తున్నాయి. దేవతామూర్తుల ఆకృతిలో తయారైన ప్రమిదలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.