ETV Bharat / state

ఈ యువకుడు రివర్స్​లోనూ బొమ్మ గీయగలడు! - గుంటూరులో నోటితో యువకుడి పేయింటింగ్ న్యూస్

చిన్నతనంలోనే ఆ యువకునికి చిత్రకళ అంటే ఆసక్తి ఏర్పడింది. పెద్దయ్యే కొద్దీ అమితమైన ఇష్టంగా మారిపోయింది. బొమ్మలు వేయటం మొదలుపెట్టాక విభిన్నత వైపు ఆలోచన మళ్లింది. తిరగేసి బొమ్మ గీయటం, చేతితోనే కాకుండా నోటితో, కాలితోనూ కుంచె తిప్పటం మొదలుపెట్టాడు. భిన్న రీతుల్లో విభిన్న చిత్రాలు గీయటం ద్వారా ప్రత్యేకతను చాటుతున్నాడు గుంటూరు జిల్లాకు చెందిన యశ్వంత్.

ఈ యువకుడు రివర్స్​లోనూ బొమ్మ గీయగలడు!
ఈ యువకుడు రివర్స్​లోనూ బొమ్మ గీయగలడు!
author img

By

Published : Jan 14, 2021, 8:45 AM IST

ఈ యువకుడు రివర్స్​లోనూ బొమ్మ గీయగలడు!

తెనాలికి చెందిన యశ్వంత్‌కు... పాఠశాల నుంచే పుస్తకాల్లోని బొమ్మలను చక్కగా గీస్తాడనే పేరుంది. ఇదే క్రమంలో తన నైపుణ్యాన్ని పెంచుకోవాలని భావించి.. చిత్రలేఖనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. కళాశాల సమయంలో అధ్యాపకులు పాఠం చెబుతుంటే వారి చిత్రాలు పుస్తకంపై గీసేవాడు. అదే విధంగా వివిధ రంగాల్లోని ప్రముఖుల చిత్రాలు వేయటం మొదలుపెట్టిన ఆ యువకుడు... వాటర్ కలర్స్‌తోనే కాకుండా... బాల్ పాయింట్ పెన్ లేదా పెన్సిల్‌తో చుక్కల చిత్రాలు వేసేవాడు. యూట్యూబ్‌లో వీడియోల ద్వారా చిత్రకారులు గీస్తున్న బొమ్మలు చూస్తూ మరికొన్ని మెళకువలు నేర్చుకుని.... ఎన్నో చిత్రాలకు ప్రాణం పోశాడు యశ్వంత్‌.

5 నిమిషాల్లో అమితాబ్ చిత్రం

తనకంటూ ప్రత్యేకను చాటుకోవాలని భావించి.. బొమ్మలను తిరగేసి గీయటం మొదలుపెట్టాడు. నోటితోనూ చిత్రాలు గీయాలని సంకల్పించి... కరోనా సమయంలో ఈ దిశగా సాధన చేశాడు. ముంబయిలో కలర్స్ ఛానల్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొని... అమితాబ్ బచ్చన్ చిత్రాన్ని 5 నిమిషాల్లో.. రివర్స్‌లో గీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దివ్యాంగులు సైతం చిత్రకారులుగా మారవచ్చనే సందేశం ఇచ్చేందుకు ఈ విధానంలో బొమ్మలు వేసినట్లు యశ్వంత్ చెబుతున్నాడు.

ఆన్​లైన్​లో చూసి..

పెయింటింగ్‌పై యశ్వంత్​కు ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు.... ఎంతో ప్రోత్సహించారు. కళ్లు మూసుకుని పజిల్స్ పూరించటంలోనూ తన కుమారుడు నేర్పరి అంటూ తండ్రి మురిసిపోతున్నారు. చదువు కొనసాగిస్తూనే... తీరిక వేళల్లో సాధన చేస్తూ... తనలోని నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు యశ్వంత్‌. ఎలాంటి శిక్షణ లేకుండా కేవలం ఆన్​లైన్​లో చూసి చిత్రకారుడిగా మారుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇదీ చదవండి: జీవన సరళి మారుతోంది.. నాటి సంస్కృతికి ఆదరణ పెరుగుతోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.