Dhulipalla Narendra: ధూళిపాళ్ల వీరయ్యచౌదరి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. తన తర్వాత డెయిరీ ఛైర్మన్‌గా ఎవరు ఉంటారో వారే ట్రస్టు బాధ్యతలు చూస్తారని ఆయన ప్రకటించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఈ పదవిని అడ్డుపెట్టుకుని తనపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిరీ నీడలో పనిచేసిన పాత ఉద్యోగులే కోర్టులో పిటిషన్లు వేసి.. ట్రస్టుని వివాదాల్లోకి లాగడం బాధ కలిగిస్తోందని ధూళిపాళ్ల నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు ఒక్క ఆధారం చూపలేకపోయారని.. టన్నుల కొద్దీ కాగితాలు తిరగేసినా ఒక్క తప్పుడు తేల్చలేకపోయారని అన్నారు.
'సంగం డెయిరీ ఏర్పాటులో నా తండ్రి వీరయ్య కృషి చాలా ఉంది. ఛైర్మన్‌గా ఉండగానే వీరయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన వారసునిగా నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఛైర్మన్‌గా ఉండగా మరణించినందున డీవీసీ ట్రస్టు ఏర్పాటు చేశారు. అప్పటి పాలకమండలి నిర్ణయాన్ని అధికారులకు తెలియజేశారు. పది ఎకరాల భూమి, ఒకరోజు పాల ఆదాయం ట్రస్టుకు కేటాయించారు. డీవీసీ ట్రస్టు తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాం. 2010లో నేను ఛైర్మన్ అయ్యాక సేవా కార్యక్రమాల విస్తరణకు నిర్ణయం. అప్పటినుంచి ట్రస్టును వివాదాల్లోకి లాగుతూనే ఉన్నారు.వీరయ్యచౌదరి ఆశయాలు ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం.అప్పట్లో ఉన్న అధికారుల నిర్ణయం ప్రకారమే అంతా జరిగింది.ఆనాటి నిర్ణయాల్లో నా ప్రమేయం ఏ మాత్రం లేదు'. -ధూళిపాళ్ల నరేంద్ర, డీవీసీ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ
ఇదీ చదవండి:
పవన్‌కల్యాణ్ మాటలతో ఏకీభవిస్తున్నాం.. పొత్తులపై అధిష్టానానిదే నిర్ణయమన్న తెదేపా నేతలు