రాష్ట్రంలో బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదు చేసిన కృష్ణాయపాలెం రైతులను వెంటనే విడుదల చేయాలంటూ దళిత ఐకాస నేతలు మందడంలో చేస్తున్న దీక్షలో ఉమామహేశ్వరరావు, తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. రైతులకు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు.
వైకాపా పాలనలో ఏ వర్గం వారు సంతృప్తిగా లేరని దేవినేని అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా దీక్ష చేస్తున్న వారికి ముఖ్యమంత్రి నమస్కారాలు చేయడాన్ని దేవినేని తప్పుబట్టారు. పోలీసుల వలయంలో సచివాలయానికి వెళ్లి వస్తున్నారని విమర్శించారు. హత్యకేసుల్లో నిందితులకు సైతం బేడీలు వేయరని.....ఏ తప్పు చేయకున్నా రైతులకు ఎందుకు సంకెళ్లు వేశారని తెనాలి శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: