వైకాపా నాయకులు ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ కాన్వాయ్ ఢీకొని గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు హనుమంతరావును ఆయన పరామర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుపై కారు ఎక్కించడం దారుణమన్నారు. ఎంపీ సురేశ్ అనుచరులు రైతులు, మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. గతంలోనూ కొంతమంది యువతపై ఎంపీ సురేశ్ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని గుర్తు చేశారు. ఇవన్నీ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని దేవినేని ఉమ ఆరోపించారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వారిపై కుట్ర పూరితంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అమరావతి ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు తెదేపా అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
'ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే మహిళలపై దాడి'
అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. అందులో భాగంగానే రైతులు, మహిళలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి