గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో విశ్రాంత సైనికుడు నంది భీమప్పకు కేటాయించిన స్థలంపై జల రవాణా శాఖ అధికారులు స్పందించారు. ఆ భూమి భీమప్పకు చెందినదేనని స్పష్టం చేశారు. ఈ మేరకు అంతకుముందున్న బోర్డును తీసేవేసి దాని స్థానంలో మరొక బోర్డును ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన ఎకరా 83సెంట్ల భూమి అక్రమణకు గురైందని సైనికుడి కుటుంబసభ్యులు, మాజీ సైనికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో దిగివచ్చిన జల రవాణా శాఖ అధికారులు.. తప్పును సరిదిద్దుకున్నారు. దీంతో సైనికుడి కుటుంబసభ్యులు, మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: