ETV Bharat / state

కరోనా కాలం.. చిల్లర లేనిదే చితి కాలదు..! - గుంటూరులో కరోనా మరణాలు

మృతదేహం తరలించాలంటే 30 వేలు.. అంత్యక్రియలు నిర్వహించాలంటే పాతిక వేలు... ప్యాకింగ్, రక్షణ ఉపకరణాల ఖర్చులు వీటికి అదనం. గుంటూరు జిల్లాలో కోవిడ్​తో మరణించిన వారి అంతిమ సంస్కారాల విషయంలో జరుగుతున్న అడ్డగోలు దోపిడీ ఇది. అసలే కరోనా ఆత్మీయులను బలి తీసుకుందన్న బాధలో ఉన్న కుటుంబ సభ్యులను ఈ దోపిడీ మరింత కుంగదీస్తోంది.

demanding money to cremate covid dead body
చిల్లర లేనిదే చితి కాలదు
author img

By

Published : Aug 20, 2020, 10:30 AM IST

కరోనా మృత దేహాల తరలింపు, అంతిమ సంస్కారాల విషయంలో బాధిత కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. అసలే అయిన వారిని పోగొట్టుకున్న ఆవేదనలో ఉండగా.. అంత్యక్రియల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సివస్తోంది. ఆసుపత్రి నుంచి అంతిమ యాత్ర వరకూ ప్రతిచోటా అడిగినంత సొమ్ము చెల్లించలేకపోతున్నారు. బంధువులు సైతం అంత్యక్రియలకు దూరంగా ఉంటున్న సమయంలో కుటుంబ సభ్యులే ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలించి కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో అడుగడుగునా వేలకు వేల రూపాయలు చెల్లించుకోవాల్సి రావటం భారంగా మారుతోంది.

చిల్లర లేనిదే చితి కాలదు
  • అడుగడుగునా డబ్బులు

తెనాలికి చెందిన ఓ మహిళ ఈనెల 14న గుంటూరు జీజీహెచ్​లో మరణించారు. ఆమె మృత దేహాన్ని గుంటూరులోని స్థంబాల గరువు శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ నిర్వాహకులు 30వేలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేక వారు అమ్మ ఛారిటబుల్ ట్రస్టు సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. గుంటూరు నగరానికి చెందిన మరో కుటుంబం జీజీహెచ్ నుంచి సంగడిగుంట శ్మశాన వాటికకు తీసుకెళ్లటానికి అంబులెన్స్​కు 20వేలు చెల్లించారు. ఎన్​ఆర్ఐ ఆసుపత్రిలో మరణించిన ఓ వ్యక్తి మృత దేహాన్ని గుంటూరులోని శ్మశాన వాటికకు తీసుకురావటానికి ఏకంగా రూ.50 వేలు డిమాండ్ చేశారు.

  • కాసుల కోసం

కోవిడ్ మృతదేహం అంటే చాలు.. కాసులు భారీగా వస్తాయనే ఆలోచనలో అంబులెన్సు సిబ్బంది, శ్మశాన వాటిక సిబ్బంది ఉంటున్నారు. అంబులెన్సు నుంచి శ్మశాన వాటికలోకి మృతదేహం తరలించేందుకు వెయ్యి నుంచి రూ.2వేలు తీసుకుంటున్నారు. అంత్యక్రియల కోసం రూ.10 నుంచి రూ.30వేలు వసూలు చేస్తున్నారు. సంగడిగుంట శ్మశాన వాటికలో ఓ మృతదేహానికి అంత్యక్రియల కోసం రూ.30వేలు డిమాండ్ చేయగా.. కుటుంబ సభ్యులు వారిని బతిమాలి రూ.15వేలు చెల్లించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

  • సమాచారం లేక..

గుంటూరు జిల్లాలో కోవిడ్​తో మరణించిన వారి మృతదేహాల తరలింపు కోసం 9 అంబులెన్సులు కేటాయించారు. జీజీహెచ్, ఎన్​ఆర్ఐ ఆసుపత్రుల్లో మరణించే వారిని ఈ అంబులెన్సుల్లో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంబులెన్సుల సమాచారం చాలామందికి తెలియక ప్రైవేటు అంబులెన్సుల వారికి వేలకు వేలు చెల్లించుకుంటున్నారు. కోవిడ్ మృతదేహాలకు పాత గుంటూరులోని శ్మశాన వాటికలో నామమాత్రపు రుసుముతో అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: 'డ్వాక్రాకు ఆసరా'.. 'డిసెంబర్ 1 నుంచి ఇంటి వద్దకే బియ్యం'..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.