గుంటూరు జిల్లాలో మైనర్ బాలికకు శీతల పానీయంలో మత్తు మందు కలిసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. పొన్నూరు పట్టణంలో నిమ్మకాయల హరికృష్ణ అనే ఓ సూపర్ మార్కెట్ నిర్వాహకుడు... తన వద్ద పనిచేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థినిని శీతల పానీయంలో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు.
ఈ నెల 18న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడిపై ఫోక్సో, రేప్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇటువంటి ఘటనలు జరిగితే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. ఈ సమావేశంలో పొన్నూరు అర్బన్, రూరల్ సీఐలు శరత్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: