ETV Bharat / state

పరీక్షలకు అనుమతించాలంటూ.. డీఈడీ విద్యార్థుల ఆందోళన - గుంటూరులో డీఈడీ విద్యార్థుల ఆందోళన వార్తలు

తమను పరీక్షలకు అనుమతించాలని యాజమాన్య కోటాలో స్పాట్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. కౌన్సిలింగ్ ద్వారా చేరనందున వీరికి హాల్ టిక్కెట్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. మరోవైపు డీఈడీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్న తరుణంలో అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోవాలని వేడుకుంటున్నారు.

డీఈడీ స్పాట్ అడ్మిషన్ల విద్యార్థుల్లో ఆందోళన

author img

By

Published : Nov 4, 2020, 4:16 PM IST

డీఈడీ స్పాట్ అడ్మిషన్ల విద్యార్థుల్లో ఆందోళన
డీఈడీ స్పాట్ అడ్మిషన్ల విద్యార్థుల్లో ఆందోళన

యాజమాన్య కోటాలో డీఈడీ స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరి రెండేళ్లు విద్యనభ్యసించిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గురువారం నిర్వహించే అకడమిక్ పరీక్షలకు వారిని అనుమతించకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. తమను పరీక్షలకు అనుమతించాలంటూ గుంటూరులో జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద విద్యార్థులు నిరాహార దీక్షలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థులు ఆందోళన చేస్తూ స్పృహ తప్పి పడిపోయారు.

అప్రమత్తమైన తోటి విద్యార్థులు 108 ద్వారా జీజీహెచ్​కు తరలించారు. రెండేళ్లు చదివిన తర్వాత ఇప్పుడు పరీక్షలకు అనుమతివ్వకపోతే తమ పిల్లల పరిస్థితేంటని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. యాజమాన్యాలు చేసిన తప్పుకు విద్యార్థులను ఇబ్బందిపెట్టడం సమంజసం కాదన్నారు. 2015, 2016, 2017 సంవత్సరాల్లో స్పాట్ అడ్మిషన్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారన్నారు. ఇప్పటి విద్యార్థులను ఎందుకు అనుమతించడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ఇవీ చదవండి:

కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరికి ఎంపీ గల్లా జయదేవ్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.