ETV Bharat / state

డీఎడ్‌ అభ్యర్థుల ఆందోళన తీవ్రరూపం.. స్పృహ తప్పిన ముగ్గురు విద్యార్థులు

రెండ్రోజుల్లో జరగనున్న రెగ్యులర్‌ విద్యార్థుల పరీక్షలకు.. తమను కూడా అనుమతించాలని కోరుతూ గుంటూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట డీఎడ్‌ యాజమాన్య కోటా విద్యార్థుల ధర్నా తీవ్రరూపం దాల్చింది. ఆందోళనలో ముగ్గురు విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు.

DED students protest at guntur
డీఎడ్‌ అభ్యర్థుల ఆందోళన తీవ్రరూపం
author img

By

Published : Nov 4, 2020, 11:20 AM IST

డీసెట్‌ పరీక్ష ఉత్తీర్ణులు కానివారికి, కనీసం ఆ పరీక్ష రాయనివారికి 2018-20 విద్యా సంవత్సరంలో జిల్లాకు చెందిన అనేక డీఎడ్‌ కళాశాలల యాజమాన్యాలు కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన సీట్లను ఇచ్చి భర్తీ చేసుకున్నాయి. ప్రస్తుతం వారికి పరీక్షలు పెట్టే పరిస్థితి లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. కన్వీనర్‌ కోటాలో సీట్లు పొందిన వారికి గురువారం నుంచి పరీక్షలు జరగబోతున్నాయి. దీంతో వీరి ఆందోళన మంగళవారం తీవ్రరూపం దాల్చింది. గడిచిన మూడు రోజుల నుంచి వారు తమకు పరీక్షలు పెట్టాలని, హాల్‌టిక్కెట్లు మంజూరు చేయాలని కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ శిబిరాన్ని మంగళవారం ఏకంగా జిల్లా విద్యాశాఖ, ఆర్జేడీ కార్యాలయం ఆవరణలోకి మార్చి ఆందోళనకు ఉపక్రమించారు. వీరికి ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం బాసటగా నిలిచింది. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ, జిల్లా కలెక్టరేట్‌లో వినతులు అందించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన ఉద్ధృతం చేశారు. దీక్షలో మొత్తం 10 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూర్చున్నారు. ఉదయం నుంచి అన్నపానీయాలు తీసుకోకపోవడంతో స్వాతి, చిన్నారి, నారాయణ అనే విద్యార్థులు రాత్రి 7.30 గంటలకు స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని జీజీహెచ్‌కు తరలించారు

ఇదీ సమస్య..

స్పాట్‌ అడ్మిషన్ల పేరుతో యాజమాన్యాలు వీరికి ప్రవేశాలు కల్పించాయి. ఉపాధ్యాయ విద్యపై ఆసక్తితో డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌)లో వీరు ప్రభుత్వం నిర్దేశించిన కౌన్సెలింగ్‌ నిబంధనలతో సంబంధం లేకుండా ప్రవేశాలు పొందారు. వీరు రెండేళ్ల కోర్సు అభ్యసించారు. వీరికి పరీక్ష నిర్వహించే సమయానికి కరోనా తీవ్రరూపం దాల్చడంతో గతంలో రెండుసార్లు వాయిదాపడ్డాయి. అప్పట్లో వారికి హాల్‌టిక్కెట్లు రాలేదు. అప్రమత్తమైన యాజమాన్యాలు, విద్యార్థులు తమ ప్రవేశాలను ధ్రువీకరించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆ ప్రవేశాలను ఆమోదించవద్దని ప్రభుత్వం కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ హైకోర్టు జులై 24న తీర్పు వెలువరించింది. యాజామాన్యాలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కోర్టు కొట్టివేసింది. అయినా మరోసారి విద్యార్థులతో కోర్టులో పిల్‌ వేయించారు. వాటిపై వాదనలు జరుగుతున్నాయి. జిల్లాలో సుమారుగా 3వేల మంది విద్యార్థులకు మంగళవారం వరకు హాల్‌టిక్కెట్లు రాలేదు. వీరంతా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల వల్లే

డైట్‌సెట్‌లో సీట్లు పొందిన ప్రతి ఒక్కరివి కన్వీనర్, జిల్లా డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ధ్రువీకరించాలి. నిబంధనలు మేరకు వారి ప్రవేశాలు జరగకపోవడంతో హాల్‌టిక్కెట్లు మంజూరు చేయలేదు. - రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్జేడీ

ఇదీ చదవండి: పరీక్షకు అనుమతించకుంటే ఆత్మహత్యే శరణ్యం: డీఎడ్‌ విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.