ETV Bharat / state

సంప్రదాయ విధానం అనుమతించబోము.. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఈ-ఆఫీసులోనే.. - andhra pradesh latest news

E Office: సంప్రదాయ విధానంలో కాగితాల ద్వారా దస్త్రాల్ని పంపడం, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడాన్ని అనుమతించబోమని సీఎస్ జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు. జనవరి 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఈ-ఆఫీసులోనే చేయాలని ఆదేశించారు.

CS Jawahar Reddy
సీఎస్ జవహర్‌రెడ్డి
author img

By

Published : Dec 24, 2022, 9:50 AM IST

E Office: జనవరి 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఈ-ఆఫీసులోనే చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల మధ్య దస్త్రాలు, ప్రతిపాదనలు, ఉత్తర ప్రత్యుత్తరాలను విధిగా ఈ-ఆఫీసు ద్వారానే నిర్వహించాలంటూ ఉత్తర్వులిచ్చారు. జనవరి 1 నుంచి సంప్రదాయ విధానంలో కాగితాల ద్వారా దస్త్రాల్ని పంపడం, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడాన్ని అనుమతించబోమని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం "ఈ-ఆఫీసు" ప్రవేశపెట్టి ఆరేళ్లయినా చాలా ప్రభుత్వ విభాగాలు ఉత్తర ప్రత్యుత్తరాలను కాగితాల ద్వారానే నిర్వహిస్తున్నాయి. ఏసీబీ సహా వివిధ విభాగాధిపతులు అందజేసిన ప్రతిపాదనలు, నివేదికలు కనిపించకుండా పోతున్నాయి. అందువల్ల ఈ-డిస్పాచ్, ఈ-తపాల్‌ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని నిర్దేశించారు. ఈ విధానం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఏసీబీ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు తమ నివేదికలను ఏపీ విజిలెన్స్‌ కమిషన్‌కి, సంబంధిత శాఖ కార్యదర్శికి డిజిటల్‌ ఫార్మాట్‌లోనే పంపించాలని స్పష్టం చేశారు.

ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఈ-ఆఫీసులోనే చేయాలని ఆదేశించిన సీఎస్ జవహర్‌రెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.