ETV Bharat / state

రైతులకు కడగండ్లు మిగిల్చిన నివర్ తుపాను - Nivar cyclone effect on paddy farmers

నివర్ తుపాను గుంటూరు జిల్లా వరి రైతులకు అపార నష్టం మిగిల్చింది. మూడు రోజులలో కోత కోసి ధాన్యం ఇంటికి చేరే సమయంలో తుఫాన్ ప్రభావంతో పొలాల్లో నీరు చేరడంతో అన్నదాతలు పంటపై ఆశలు వదిలేసుకున్నారు. కోత కోసి ఓదెలు వేసిన పొలాల్లో నీటిపై వరి పైరు తేలియాడుతోంది. నాలుగు రోజులుగా నీటిలో ఉన్న వరి గింజలకు మొలకలు వస్తున్నాయి. లక్షలు పెట్టుబడి పెట్టి చేతికి వచ్చే సమయానికి... ధాన్యం నీటి పాలైందని కర్షకులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

crop-damage-in-lakhs-of-acres-in-guntur-due-to-the-impact-of-nivar-cyclone
రైతులకు కడగండ్లు మిగిల్చిన నివర్ తుపాన్
author img

By

Published : Nov 30, 2020, 1:24 PM IST

గుంటూరు జిల్లాలో తాజా సీజన్​లో 2 లక్షల 30 వేల హెక్టార్లలో వరి సాగు అయ్యింది. తుపాను ప్రభావంతో లక్షా 30 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. ఎకరానికి రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టి... కౌలు చెల్లించి పంట ఇంటికి చేరుతుందని ఆనందంలో ఉన్న అన్నదాతలకు నివర్ తుపాను నిరాశను మిగిల్చింది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి... చేతికి చిల్లి గవ్వ రాకుండా పోయిందని కాకుమాను మండలంలోని రైతులు ఆవేదన చెందుతున్నారు.

నీటిలో నాని మొలకెత్తున్న ధాన్యం

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను, వట్టిచెరుకూరు మండలాల్లో వరి దెబ్బతింది. తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గలాలో వరి రైతులు పూర్తిగా నష్టపోయారు. కృష్ణా డెల్టా ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు జరుగుతుంది. మూడు రోజులలో ఇంటికి చేరే పంట నీటిలో మునిగిపోయి కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లింది. నాలుగు రోజులుగా నీటిలో ఉన్న వరి గింజలకు మొలకలు వస్తున్నాయని...అవి ఎందుకు పనికి రావని రైతులు వాపోతున్నారు.

2013లో వరదలు కారణంగా తీవ్ర పంట నష్టం జరిగాక....ఆ స్థాయిలో మళ్లీ ఇప్పుడు నష్టపోయారు. కాకుమాను మండలంలో మురుగు నీటి వ్యవస్థ సక్రమంగా లేక పోవడంతో... పొలాల్లోనే నీరు నిలిచి పంట నష్టానికి కారణం అవుతుంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

తక్కువ ముళ్లు... ఎక్కువ రుచి... ఉప్పు నీటిలో పెరిగే అప్పలు చేప

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.