గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు స్థానికులు అడ్డు తగిలారు. సత్తెనపల్లి నాగన్నకుంటకు చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతదేహాన్ని కరోనా పరీక్షల అనంతరం బంధువులకు అప్పగించారు. వారు మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఏర్పాటు చేయగా... స్థానికులు అభ్యంతరం తెలిపారు.
కరోనా నివేదిక వచ్చాకే అంత్యక్రియలు ప్రారంభించాలన్నారు. గుంత కూడ తవ్వనివ్వలేదు. చేసేదేమీలేక కుటుంబ సభ్యులు పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. వారు సైతం నివేదిక వచ్చిన తర్వాతే అంత్యక్రియలు చెయ్యాలని చెప్పారు. ఈ క్రమంలో వృద్ధురాలి మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచారు.
ఇదీ చదవండి: