గుంటూరులో ఏర్పాటు చేసిన బాణాసంచా విక్రయ కేంద్రాల్లో... కొనుగోలుదారులు ధరలు చూసి వెనక్కి తగ్గుతున్నారు. టపాకాయలపై జీఎస్టీ పేరుతో అదనపు వడ్డింపులు... కొనుగోలుదార్లను నిరుత్సాహపరుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. పర్యావరణ హితం కోసం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరగిన కారణంగా చైనా దిగుమతులు మార్కెట్లోకి అంతగా రాలేదు. తుపాను భయంతో దుకాణాలు తక్కువగానే పెట్టగా.... కొనుగోళ్లు సైతం అంతంతమాత్రంగానే కొనసాగాయి.
ఇదీ చూడండి: