ETV Bharat / state

'వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే.. ఉద్యమం చేస్తాం' - ఏపీ తాజా వార్తలు

రాష్ట్రంలోని అటవీ స్థలాల్లో 30 సంవత్సరాలకుపైగా ఉంటున్న వాళ్లకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

cpm madhu
cpm madhu
author img

By

Published : Dec 23, 2020, 9:43 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేటలో ఫారెస్ట్ ఏరియా ఇళ్ల రెగ్యులరైజేషన్ అండ్ ఇళ్ల పునఃనిర్మాణ సాధన కమిటీ నిర్వహించిన సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా స్థలాలు ఇవ్వకుండా.. ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయని ఆరోపించారు.

ఈనెల 25 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలతో పాటు వాటి నిర్మాణానికి ఆర్దిక సహాయం చేస్తామని ప్రకటించిందని... వాటికి అదనంగా మరో 2 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే సమస్య తాత్కాలికంగా పరిష్కారం అవుతుందని అన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

వైకుంఠ ద్వార దర్శనానికి... తిరుమల ముస్తాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.