దళితులపై దాడులకు నిరసనగా గుంటూరు సీపీఐ కార్యాలయంలో రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జడ్జి రామకృష్ణ, రాజకీయ, ప్రజా, రైతుసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. జడ్జి రామకృష్ణపై దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని సదస్సు డిమాండ్ చేసింది.
సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ప్రభుత్వం గొప్పులు చెప్పుకొంటోందని... అధికారంలోకి వచ్చాక ఏ ప్రభుత్వమైనా పని చేయాల్సిందేనని.... పాలకులు ఏమైనా సొంత డబ్బులు వెచ్చిస్తున్నారా? అంటూ రామకృష్ణ నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. జడ్జి రామకృష్ణకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని మాజీమంత్రి ఆలపాటి డిమాండ్ చేశారు. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
ఇదీ చదవండి: