కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. గుంటూరులో సమావేశంలో మాట్లాడిన ఆయన దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భాజపా సర్కారు పౌరసత్వాన్ని మతంతో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన.. పౌరసత్వానికి మతం ప్రతిపాదికత కాదన్నారు. పార్లమెంట్లో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేసిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: