సీపీఐ-ఎంఎల్(రెడ్ స్టార్) కేంద్ర కమిటీ సమావేశాలు గుంటూరులో జరుగుతున్నాయి. గుంటూరు శివారు లింగాయపాలెంలోని కామ్రేడ్ కొల్లా వెంకయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రామచంద్రన్ ఎర్రజెండా ఎగరేసి అమరవీరులకు జోహార్లు అర్పించటం ద్వారా సమావేశాల్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈనెల 24వ తేదీ వరకూ సమావేశాలు జరగనున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాల నుంచి నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.
మూడు వ్యవసాయ చట్టాలపై పోరాట కార్యాచరణపై సమావేశాల్లో చర్చిస్తున్నారు. ఏడాది నుంచి రైతులు చేస్తున్న పోరాటాన్ని కేంద్ర పెడచెవిన పెట్టడాన్ని సమావేశం తప్పుబట్టింది. భాజపాను ఓడించటం, కాషాయ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటంపై కార్యాచరణ రూపొందిస్తున్నట్లు నేతలు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా విప్లవ కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష శక్తుల ఐక్యత గురించి సమావేశాల్లో చర్చించనున్నారు.
ఇదీ చదవండి: