ఇసుక కొరతను నిరసిస్తూ... గుంటూరు జిల్లాలో ధర్నాకు పిలుపునిచ్చిన సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇసుక రీచ్లు, డంపింగ్ యార్డుల వద్ద ధర్నాకు యత్నించిన నేతలను అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లి మండలం పాతూరులో ఇసుక రీచ్ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న... సీపీఐ నాయకులను సీఐ అంకమరావు అరెస్టు చేశారు. మంగళగిరి మండలం నవులూరు ఇసుక డంపింగ్ యార్డులో ధర్నాకు యత్నించిన నేతలను అదుపులోకి తీసుకున్నారు. 2 మండలాల్లో దాదాపు 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇవీ చదవండి...వైకాపా చర్యలకు ప్రతిచర్య ఉంటుంది: పరిటాల శ్రీరామ్