గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులకు అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. గురువారం పార్టీ నేతలతో కలిసి కృష్ణాయపాలెంలో పర్యటించిన ఆయన.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టయిన రైతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. రైతులు బెయిల్పై జైలు నుంచి విడుదల కాగానే వారిని గుంటూరు నుంచి విజయవాడ వరకు భారీగా ఊరేగిస్తామని రామకృష్ణ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
రైతులకు బేడీలు వేసిన తొలి ప్రభుత్వంగా జగన్ సర్కారు నిలిచిపోతోందన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 317రోజులుగా అమరావతి ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులని విమర్శలు చేసింది కాకుండా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతారా అంటూ నిలదీశారు. అంతకుముందు రైతుల దీక్షా శిబిరంలో పాల్గొని వారికి మద్దతుగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి