వైకాపా ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తూ అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి పూనుకుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. గుంటూరులోని సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అమరావతిని రాజధానిగా ప్రకటించాలని భూములు ఇచ్చిన రైతులు నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు. రాజధాని విషయంలో వైకాపా ఎన్నికలకు మందు ఓ మాట, తరువాత మరో మాట చెబుతోంది. రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ప్రజలను మోసం చేస్తోంది. ముఖ్యమంత్రులు, పార్టీలు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రమే శాశ్వతం. అమరావతి రైతులకు మద్దతుగా 23వ తేదీన వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం- ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
ఇదీ చదవండి