ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలపై దాడులు అరికట్టాలంటూ గుంటూరులో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మతతత్వ మోదీ ప్రభుత్వం... రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుందని సీపీఐ రాష్ట్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. మోదీ ప్రభుత్వ నిరంకుశ వైఖరితో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, మైనార్టీలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులకు వ్యతిరేకంగా వామపక్షాలు చేపట్టే ప్రజా ఉద్యమానికి అన్నివర్గాలు కలిసి రావాలన్నారు.
ఇది చూడండి: మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవికి నన్నపనేని రాజీనామా