ఉమ్మడి రాష్ట్రంలో చరిత్రాత్మక విద్యుత్ పోరాటం జరిగి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా... గుంటూరులో వామపక్ష నేతలు నిరసన చేపట్టారు. శంకర్ విలాస్ కూడలి వద్ద సీపీఐ, సీపీఎం నేతలు నిరసన తెలిపారు. బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన పోరాట యోధులను స్మరించుకున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచిన ఏ ప్రభుత్వమూ ఎక్కువ రోజులు అధికారంలో లేదని హెచ్చరించారు. విద్యుత్ చట్టసవరణ పేరుతో పేదలకు ఇచ్చే రాయితీలు దూరం అవుతున్నాయన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :
పోలీస్ స్టేషన్లో సివిల్ కేసులు నిర్వహించరాదు: ఎస్పీ అమ్మిరెడ్డి