కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా... అమరావతిలోనే రాజధాని ఉండాలని ఎందుకు మాట్లాడడం లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. మూడు రాజధానులనే తుగ్లక్ నిర్ణయాన్ని మానుకోవాలని ముఖ్యమంత్రి జగన్కు సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ చర్యల్లో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. గత ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి తాము కొత్త పథకాలు అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ప్రజలు అధికారం ఇచ్చినందుకు మంచి పాలన అందించాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్